calender_icon.png 14 July, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపుల్ ఫ్రెండ్లీ లవ్‌స్టోరీ

13-07-2025 12:50:38 AM

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రకథానాయకుడు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శనివా రం విడుదల చేశారు.

హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ పోస్టర్‌లో సంతోష్ శోభన్.. చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న మిడిల్ క్లాస్ తెలుగు అబ్బాయిగా కనిపించారు. చెన్నై నగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమ కథాచిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సిని మా త్వరలోనే తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంగీతం: ఆదిత్య రవీంద్రన్; డీవోపీ: దినేశ్ పురుషోత్తమన్; ఎడిటర్: గణేశ్ శివ; ఆర్ట్: మైఖేల్ బీఎఫ్‌ఏ.