13-07-2025 12:48:50 AM
మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న తాజాచిత్రం ‘సీతా పయనం’. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్‌ఫుల్ పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పాట విడుదలైంది.
‘ఏ ఊరికెళ్తావే పిల్లా’ అంటూ సాగే ఈ పాటను విమలా గద్దర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె వెన్నల గద్దర్ కూడా పాల్గొన్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ ఈ స్వరాలు సమకూర్చగా, రాహుల్ సిప్లిగంజ్, మధుప్రియ పాడారు. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్; డీవోపీ: జీ బాలమురుగన్, ఎడిటర్: అయూబ్‌ఖాన్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా.