14-02-2026 12:00:00 AM
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఇందులో మానస వారణాసి హీరోయిన్‌గా నటి స్తోంది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ కుమార్ రాజు పీ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్లు అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, నందినీరెడ్డి, అభిలాష్ రెడ్డి, నిర్మాత స్వప్న దత్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “సంతోష్ నేచురల్‌గా నటిస్తాడు. ఈ సినిమాతో ఆయనకు సూపర్ హిట్ దక్కాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. చిత్ర కథానాయకుడు సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “కపుల్ ఫ్రెండ్లీ’ ఒక డీప్లీ ఎమోషనల్ మూవీ. ఈ నెల 14 నుంచి మా మూవీతో ఎమోషన్‌ను కూడా ఫీల్ అవుదాం” అన్నారు.
కథానాయకి మానస మాట్లాడుతూ.. “ఈ వాలెంటైన్స్ డే సీజన్‌లో కపుల్ ఫ్రెండ్లీ మూవీని ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. చిత్ర దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “కేవలం టైటిల్ వల్లే ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఏ అంటే మా దృష్టిలో ఆల్ అని అనుకుంటున్నాం” అన్నారు. ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. “రియాల్టీకి దగ్గరగా ఉండే చిత్రమిది” అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్‌తోపాటు మిగతా చిత్రబృందం, అతిథులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.