1 July, 2026 | 11:07 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

7 వేలు దాటిన కొవిడ్ కేసులు

12-06-2025 12:00 AM
  1. ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య

కేరళలో తగ్గని ఉధృతి

న్యూఢిల్లీ, జూన్ 11: చాపకిందనీరులా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 7121 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నాటికి 6,815 కేసులు ఉండగా, 24 గంటల్లోనే 300కు పైగా కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కొవిడ్ ఉధృతి అధికంగా ఉంది. ఇక్కడ ఒక్కరోజులోనే కొత్తగా 170 కేసులు నమోయ్యాయి. మొత్తం 7 వేలకుపైగా కేసుల్లో 2,223 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవ్వడం విశేషం. 

ఆ తర్వాత గుజరాత్‌లో 1,223 కేసులు, ఢిల్లీలో 757, పశ్చిమ్ బెంగాల్‌లో 747 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 615, కర్ణాటక 459, ఉత్తర్‌ప్రదేశ్ 228, తమిళనాడు 204, హర్యానా 125, రాజస్థాన్ 138, మధ్యప్రదేశ్ 65, ఛత్తీస్‌గఢ్ 48, బీహార్ 47, ఒడిశా 41, పంజాబ్, సిక్కి 33 చొప్పున, ఝార్ఖండ్, పండిచ్ఛేరిలలో 10 చొప్పున, జమ్మూకశ్మీర్ 9, అస్సాం, గోవాలో 6 చొప్పున, ఛండీగఢ్, ఉత్తరాఖండ్ మూడు చొప్పున, హిమాచల్ 2, మణిపూర్, త్రిపురలలో ఒక్కో కేసు నమోదైంది.

తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 72 కేసులు నమోదవగా, తెలంగాణలో 11 కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నాటికి దేశవ్యాప్తంగా ఆరుగురు మృతిచెందారు. ఇందులో కేరళకు చెందిన వారే ముగ్గురు ఉన్నారు. మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతిచెందారు.