16 April, 2026 | 9:03 AM

ముగిసిన చర్చలు

12-06-2025 12:00 AM
  1. నెలాఖరుకు భారత్ మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం!
  2. 4 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల చర్చలు

న్యూఢిల్లీ, జూన్ 11: భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కొరకు న్యూఢిల్లీ వేదికగా 4నుంచి నుంచి జరిగిన ద్వైపాక్షిక చర్చలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెలాఖరు వరకు ఈ రెండు దేశాల నడుమ మధ్యంత వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు దేశాల నడుమ చర్చలు ఫలప్రదంగా ముగిసినట్టు ఈ చర్చల్లో పాల్గొన్న అధికారి తెలిపారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు.

మార్కెట్ యాక్సెస్, డిజిటల్ ట్రేడ్, వాణిజ్యానికి ఉన్న సాంకేతిక అడ్డంకులు, కస్టమ్స్ అండ్ వాణిజ్య సులభతరం మొదలయిన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. మొదటగా భావించిన దాని ప్రకారం ఈ చర్చలు సెప్టెంబర్ నాటికి ప్రారంభ చర్చలను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న తేదీ కంటే ముందుగానే చర్చలు పూర్తయ్యాయి. భారత్‌పై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన అమెరికా తర్వాత 90 రోజుల విరామం ఇచ్చింది.

ఆ గడువు జూలై 9తో ముగియనుంది.  గడువు కంటే ముందుగానే మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా మధ్య వాణిజ్యం 131.84 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేర జరిగింది.

ఆ సమయంలో అమెరికా ఇండియాకు ఎగుమతయ్యే వస్తువులపై 18 శాతం, భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 6.22 శాతం మేర సుంకాలు విధించింది. ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 26 శాతం సుంకాలు విధిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.