19 March, 2026 | 1:36 AM

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ

19-03-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, మార్చి 18 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని పలు పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్  గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద జరుగుతు న్న భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల ని ఘాను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పరీక్షలు పారద ర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద ఒక నిరంతర నిఘా ఉంచేందుకు ’స్టాటిక్ ఫోర్స్’ను కేటాయించామని, పరీక్ష ముగిసే వరకు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వా సంతో పరీక్షలు రాయాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంలో పో లీసు శాఖ సహకరిస్తుందని భరోసా ఇచ్చా రు.

పరీక్షా విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పోలీ సు అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.