ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిరుజల్లులు
నాలుగు రోజులు అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
కరీంనగర్, మార్చి18(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒ క్కసారిగా మారిపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఈ కాలంలో ఎండలు తీవ్రత పెరుగుతాయని భావించిన సమయంలో, అకాల వర్షం కురవడంతో చ ల్లని వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఈ చిరు జల్లుతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్ల బడింది.
జిల్లాలోని తిమ్మాపూర్, మనకొండూర్, కొత్తపల్లి మండలాలతో పాటు పలు గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఈదు రుగాలులు తీవ్రంగా వీచడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. సాయంత్రం వేళల్లో వ ర్షం మరింత ఉధృతమై, ఒక్కసారిగా గాలు లు వేగం పెరగడం గమనార్హం.వాతావరణ శాఖ ఈ పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేస్తూ, రాబోయే నాలుగు రోజుల పాటు వ ర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.
ముఖ్యంగా గురువారం రోజున జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చ రించింది.ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద, పాత భవనాల వద్ద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల సమీపంలో నిలబడకూడదని హెచ్చరిస్తున్నారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.
ఈ అకా ల వర్షాలు రైతులకు ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళనను కలిగిస్తున్నాయి. వేసవి ప్రారంభ దశలో పడుతున్న ఈ వర్షాలు భూగర్భ జలాలను పెంచడంలో కొంత సహాయపడవచ్చు. అయితే కోత దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి పంటలు తడవడంతో నాణ్యత తగ్గే అవకాశం ఉందని వ్యవ సాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంద రు రైతులు ఇప్పటికే కోసిన పంటలను కాపాడుకునేందుకు సిద్దం అవుతున్నారు. వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.




