11 July, 2026 | 10:54 AM

దైవాలగూడలో దారుణం.. ఆరుగురి హత్యపై స్పందించిన సీపీ తరుణ్ జోషి

11-07-2026 09:49 AM

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని అప్పగించాలంటూ మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయకపోతే మరొకరిని ప్రాణం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాద్ నగర్ -కంది రహదారిపై బంధువులు భైఠాయించారు. హత్యల అనంతరం నిందితుడు రాజ్ కుమార్ పరారయ్యాడని సీపీ తరుణ్ జోషి(CP Tarun Joshi) ప్రకటించారు. ప్రస్తుతం నిందితుడి కోసం 7 బృందాలతో గాలిస్తున్నామని సీపీ వెల్లడించారు. నిందితుడు భార్య, పిల్లల్ని చంపడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొన్నారు.

బాలికను షాబాద్ నుంచి బలవంతంగా స్వాగ్రామనికి తీసుకెళ్లినట్లు సీపీ సూచించారు. దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద బాలికను కూడా చంపేశాడని పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదు అయినప్పుడు నిందితుడు పరారీ అయ్యాడు. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని విడుదల అయ్యాడని సీపీ స్పష్టం చేశారు. రెండు మూడు సార్లు రాజ్ కుమార్ కు కౌన్సిలింగ్ ఇచ్చామని వెల్లడించారు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని కిరాతకుడు హత్య చేశాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాధిత బాలిక, బాలిక తల్లి, నాన్నమ్మ ప్రాణాలు తీశాడు. ఓ బాలికను వేధించాని మే 16న రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైనట్లు సీపీ సూచించారు.