11 July, 2026 | 10:38 AM

ఏడాదికి వెయ్యి మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయుడు.. వృక్ష ప్రేమికుడు బడిపంతులు

11-07-2026 09:53 AM

బోథ్,జులై 11(విజయక్రాంతి): బూతు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో(Model School) ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ప్రతి ఏటా 1000 మొక్కలను గత 12 సంవత్సరాల కాలంగా నాటిస్తున్నాడు. మోడల్ స్కూల్లో 2013 నుండి విధులు నిర్వహిస్తున్న పనిచేసిన పాఠశాలలో మొక్కలను నాటుతూ వాటి ఆవశ్యకతను విద్యార్థులు వివరిస్తున్నారు పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో అనేది విద్యార్థులకు తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు... 

.. పుట్టినరోజు పెళ్లిరోజుల్లో సైతం.... తన పిల్లల పుట్టిన రోజు తో పాటు మా పెళ్లి రోజు సైతం మొక్కలను నాటుతూ వస్తున్నామన్నారు తాను నివసిస్తున్న కాలనీలో ఇప్పటివరకు ఎనిమిది వందల మొక్కలను నాటించడం జరిగిందన్నారు తాను పనిచేసే ప్రతి పాఠశాల మొక్కలతో నిండి ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా విద్యార్థుల చేత నాటిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం బోత్ ఆదర్శ పాఠశాలలో అరుదైన ఎర్రచందనం మొక్కలను నాటించడం జరిగిందన్నారు స్వయంగా తానే మొక్కలను పెంచి నాటిస్తున్నానని ఏ నర్సరీకి వెళ్లకుండానే మొక్కలను పెంచానన్నారు తన భార్య అటవీ శాఖలో ఉద్యోగం చేస్తున్నందున మొక్కలు నాటడం పైన పైన మరింత ఆసక్తి పెరిగిందని వివరించారు ఏదేమైనా ఉపాధ్యాయుడు వృక్ష ప్రేమికుడిగా గుర్తింపు పొందుతున్నాడు