11 July, 2026 | 10:40 AM

ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను సైనికులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు

11-07-2026 09:55 AM

బోథ్, జులై 11(విజయక్రాంతి): మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులను సైనికులుగా తీర్చిదిద్దాలన్న దృక్పథంతో ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులు సైనికులుగా ఎదగాలన్న ఆలోచనతో పాఠశాల ఉపాధ్యాయులు పి ఈ టి లు విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు పాఠశాలలో కనీసం రెండు కిలోమీటర్ల పరుగు పోటీలను నిర్వహిస్తున్నారు దీంతో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటున్నారని పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ప్రతి ఏడాది తమ పాఠశాల నుండి కనీసం 20 మంది పిల్లలు అయినా సైనికులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు విద్యార్థులు సైనిక పాఠశాలలకు అకాడమీలకు వెళ్లకుండానే ఇక్కడి నుండే నేరుగా సైనికులుగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఈ విషయంలో తమకు సహకరిస్తున్నారని వివరించారు