11 July, 2026 | 3:52 AM

రుణమాఫీ ప్రమాణం ఏమైంది?

11-07-2026 02:29 AM
  1. భద్రాద్రి రాముడి సాక్షిగా చేశావు
  2. తెలంగాణకు కాంగ్రెస్ సర్కార్ జల ద్రోహం
  3. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది?, రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగ లవా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి రేవంత్‌రెడ్డి.. నాది కాదు అని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు.

ఖమ్మంలో సీఎం రేవంత్ వ్యాఖ్య లపై హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. ఒకవైపు ‘చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం’ అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు? అని మండిప డ్డారు. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకో వాలని చూడటం హీనమైన చర్య అని విమర్శిం చారు. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదు..

లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి.. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోందన్నారు. 

తెలంగాణ ప్రభు త్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుం దన్నారు. దేవాదుల నుంచి కిందికి వెళ్తున్న గోదావరి నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుం టుంటే, తెలంగాణ  చేతులెత్తేయడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.