8 April, 2026 | 8:07 PM

రేపు సీపీగెట్ నోటిఫికేషన్

14-05-2024 01:39 AM

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎమ్మెస్సీ, ఎం కామ్, ఎంఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ ఈనెల 15న విడుదల కానుంది. ఈ ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈనెల 15న తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయా యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం జరగనుంది. ఆ సమావేశం అనంత రం అదే రోజు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.