నేడు ఉదయం ఐదున్నర నుంచే మెట్రో సేవలు
14-05-2024 01:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13(విజయక్రాంతి) : హైదరాబాద్ నగర వాసులకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. నేడు ఉదయం ఐదున్నర గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సోమవారం సెలవు ఇవ్వ గా శనివారం, ఆదివారం వారాం తం కావడంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లారు. కాగా, మంగళవా రం వారంతా నగరానికి తిరిగి రానున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో, ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మంగళవారం మెట్రో సే వలను ఉదయం ఐదున్నరకే ప్రారంభించనున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ౬గంటల నుంచి మె ట్రో సేవలు ప్రారంభమవుతాయి




