calender_icon.png 1 October, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురం మండలంపై ఎర్ర జెండా రెపరెప అన్ని స్థానాల్లో సీపీఐ పోటీ

01-10-2025 12:00:00 AM

అశ్వాపురం,సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అశ్వాపురం మండలంలోని ప్రతి స్థానంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తన అభ్యర్థులను రంగంలోకి దింపనుందని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మండల సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కొద్దిరోజుల్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ తప్పనిసరిగా బరిలో దిగుతుంది.

పొత్తులు సాధ్యమైతే లౌకిక శక్తులతో కలిసి పనిచేస్తాం. లేకపోతే సిపిఐ స్వతంత్రంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అని తెలిపారు. అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజల మద్దతుతో సిపిఐ భారీ మెజార్టీలతో విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్, మండల సహాయ కార్యదర్శులు వేల్పుల మల్లికార్జున్, మేలాపురం సురేందర్ రెడ్డి, ముత్తబోయిన వెంకటేశ్వర్లు, తెల్ల వెంకటరమణ, రాయపూడి రాజేష్, ఈనపల్లి పవన్ సాయి, కొండపర్తి ప్రసాద్, అక్కినపల్లి నాగేంద్రబాబు, కొమ్ము రాజు, కణితం ఉపేందర్, చింతల రమేష్, వెంకటేశ్వర్లు తదితరులుపాల్గొన్నారు.