calender_icon.png 1 October, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరు ఏరియాలో 86 శాతం బొగ్గు ఉత్పత్తి

01-10-2025 12:00:00 AM

జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ 

మణుగూరు, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : ఏరియాలో సెప్టెంబర్ నెలలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 7లక్షల 56 వే ల 500 టన్నులకు గాను 6 లక్షల 47 వేల 987 టన్నులతో 86 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని, జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ వెల్లడించారు. మంగళవారం జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అలాగే 01 ఏప్రిల్, 2025 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు ప్రొగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 51 లక్షల 74 వేల 500 న్నుల లక్ష్యానికి గాను 51 లక్షల 76 వేల 816 టన్నులు బొగ్గు వెలికి తీశామన్నారు. ఈ లక్ష్యాన్నివ వందశాతం అధిగమించామని పేర్కొన్నారు.సెప్టెంబర్ నెలలో ఏరియా 6 లక్షల 47 వేల 987 టన్నుల బొగ్గును రవాణా చేశా మని,01 ఏప్రిల్, 2025 నుండి 30 సెప్టెం బర్ 2025 వరకు ప్రోగ్రెస్సివ్ గా 51 లక్షల 63 వేల 639 టన్నులు రవాణా చేయడం జరిగిందన్నారు.

ఓవర్ బర్డెన్ డిపార్ట్ మెం టల్ గా 14 లక్షల క్యూబిక్ మీటర్లకు ల క్ష్యానికి గాను 55 శాతంతో 7 లక్షల 71 వేల క్యూబిక్ మీటర్లు తీయటం జరిగింద ని చెప్పారు.సీఎం పిఎఫ్, పెన్షన్ ఐదు కేసులు, గ్రాడ్యుటి 9 కేసులు, ఎఫ్ బి ఐ ఎస్ (ఎక్యుములేషన్) 100, ఎల్ ఎస్ పి 25 లక్షలు 1 కేసు, హెచ్ బి ఎల్ ఐ ఆర్ ఎస్ 1 కేసు, సిపిఆర్‌ఎంఎస్ కార్డ్ 1 కేసు, పరిష్కరించామని, ప్రభావిత గ్రామాలలో 54 మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేశామ ని తెలిపారు.

కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి పీకేఓసి వీరభద్ర , ప్రాజెక్టు అధికారి మణుగూరు ఓసి చంద్ర శేఖర్, శ్రీనివాస్, రాంబాబు , డిజిఎం (పర్సనల్) ఎస్. రమే శ్ , డిజిఎం ( ఫైనాన్స్) శ్రీమతి ఎం. అనురాదా , డిజిఎం (సివిల్) శివ ప్రసాద్, డి వై.సిఎంఓ జ్యోతిర్మై, పర్యావరణ అధికారి శ్రీనివాస రావు, డివై. ఎస్‌ఈ డివి ఎస్ ఎన్ ప్రవీణ్, సింగు శ్రీనివాస్,పాల్గొన్నారు.