calender_icon.png 19 December, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ(ఎం) గెలుపొందిన వార్డు సభ్యులకు సన్మానం

19-12-2025 07:01:58 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ మండలంలో ఈ నెల 11న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేసి గెలుపొందిన వార్డు సభ్యులను శుక్రవారం సీపీఐ(ఎం) నకిరేకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఆర్‌ భవన్‌లో సన్మానించారు.

ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో చందుపట్ల గ్రామానికి చెందిన సాబాదు ఇందిరమ్మ, తాటికల్లు గ్రామానికి చెందిన కాడింగుల యాదయ్య, నెల్లిబండ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మీనరసయ్య, మరోరు గ్రామానికి చెందిన పోగుల సతీష్, కడపర్తి గ్రామానికి చెందిన భూపతి రమాదేవి, నడిగూడెం గ్రామానికి చెందిన రాచకొండ ధనలక్ష్మి, రాచకొండ భాస్కర్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు యానాల కృష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యులు ఆకుల భాస్కర్, టౌన్ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యురాలు చెన్నబోయిన నాగమణి, బండమీది ఎల్లయ్య, కడపర్తి శాఖ కార్యదర్శి రామచంద్రయ్య, శాఖ సభ్యుడు భూపతి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.