calender_icon.png 23 February, 2026 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నూర్ ఎస్బీఐ ముందు బాధితుల నిరసన

23-02-2026 03:39:53 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ-2 బ్రాంచ్ ఎదుట గోల్డ్ లోన్ బాధితులు సోమ వారం నిరసన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. గడిచిన ఏడు నెలల నుంచి మా బంగారం మాకు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ బీ ఐ గోల్డ్ లోన్ భాదితులను ఆదుకోవాలని వేడుకున్నారు. ఎలాంటి ఆందోళనలు చేయకుండా పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని బందోబస్తు నిర్వహించారు.