19 March, 2026 | 2:28 AM

గుండెపోటుతో సీపీఎం నేత మహేష్ కన్నుమూత

19-03-2026 12:48 AM

మహబూబాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): సిపిఎం నేత కుర్ర మహేష్ మహబూబాబాద్ పట్టణంలో బుధవారం గుండెపోటుతో మరణించారు. విద్యార్థి దశ నుండే వామపక్ష భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ పేద ప్రజల హక్కుల సాధన కోసం, పట్టణంలో పేదలకు ఇండస్థలాల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. మహేష్ మరణ వార్త తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చాయి.