8 August, 2026 | 10:58 AM

మున్సిపల్ కమిషనర్ కు సిపిఎం వినతి

02-09-2025 08:00 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో దీర్ఘకాలంగా పేర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ కమిషనర్ ఏ రంజిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం వర్తింపచేయాలన్నారు. ఇంటి పన్నును వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 90% సబ్సిడీ కల్పించాలన్నారు.

నకిరేకల్ సెంటర్ లో రింగురోడ్డును ఏర్పాటు చేసి డివైడర్లలో మొక్కలను నాటాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన వారందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలన్నారు. రాత్రి పగలు 24 గంటలు వీధి దీపాలు వెలగడంతో కరెంటు వృధాను నివారించాలని కోరారు. దోమల నివారణకు మందు వారానికి ఒకసారి స్ప్రే చేయాలన్నారు. పట్టణంలో వివిధ వార్డులలో నెలకొని ఉన్న డ్రైనేజీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.