కలెక్టర్ కార్యాలయంలో గణపతి పూజ చేసిన కలెక్టర్
02-09-2025 07:54 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనంలో ప్రతిష్టింపజేసిన పర్యావరణ మట్టి గణపతి మండపం వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడు ప్రజలందరి శుభసంతోషాలతో ఉండాలని జిల్లాలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మొక్కులు ముక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.






