వరద బాధితులకు సుభాష్ రెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయం, సరుకుల పంపిణీ
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి.ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కౌండిన్య ఎంక్లేవ్ వరద బాధితులకు సుభాష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి మూడు వేల నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. బిబిపేట మండల నాయకులు సుభాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చినట్లు జనగామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బాబుల ఆధ్వర్యంలో బీబీ పేట మండలం సుభాష్ రెడ్డి అనుచరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి 25 కిలోల బియ్యంతో పాటు 3 వేల విలువగల నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. త్వరలోనే వరద బాధిత పిల్లలకు పుస్తకాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. సుభాష్ రెడ్డి వెంటనే స్పందించి వరద బాధితులకు సహాయం చేయడం అభినందనీయమని వారు తెలిపారు.






