సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
టీజీఈ జేఏసీ డిమాండ్
ఆళ్ళపల్లి,(విజయ క్రాంతి): సిపిఎస్ విధానాన్ని(CPS policy) రద్దు చేయాలని, టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ గడ్డం ఉమారానికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ (TPTF) జిల్లా ప్రధాన కార్యదర్శి జోగా రాంబాబు, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హతిరాం టిజిఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు బాదావత్ బద్రు ఏటిఏ రాష్ట్ర కార్యదర్శి బుడిగ సమ్మయ్య మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ ను అమలు చేయడం వలన ఉద్యోగులు అకాల మరణం చెందడం వలన వారికి కనీసం సిపిఎస్ లో దాచుకున్న అమౌంట్ ప్రతి నెల పెన్షన్ గా రూ.వెయ్యి కూడా రానటువంటి దుస్థితి. నెలకొన్నదని ఆ ఉద్యోగి కుటుంబాలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. భవిష్యత్ భద్రత లేకుండా పిల్లలను చదివిపించుకోలేని హీనమైన స్థితిలోకి వెళ్లడం జరిగిందని. టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ నీ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జిపిఎఫ్) ను తీసుకువస్తానని హామీ ఇచ్చారనీ. ప్రజా ప్రభుత్వ ఏర్పడి వెయ్యి రోజులు గడిచినా సిపిఎస్ రద్దు కాలేదని,ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ది.01.09.2004 నుండి సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించి సిపిఎస్ ఎంప్లాయిస్ ఉద్యోగ భద్రత మరియు ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతున్నామన్పారు.






