2 September, 2026 | 9:05 AM

బసవతారక నగర్‌లో 100 కేవీఏ స్థానంలో 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

02-09-2026 | 08:33am

బోధన్,(విజయక్రాంతి): రాబోయే కాలంలో పెరిగే విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు బోధన్ విద్యుత్ శాఖ అధికారులు(Bodhan Electricity Department) తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో(Summer Action Plan) భాగంగా వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు లో వోల్టేజీ సమస్యలను నివారించేందుకు అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. బోధన్ పట్టణంలోని వార్డు నంబర్ 17, 30 పరిధిలోని బసవతారక నగర్(Basavataraka Nagar) కాలనీలో SS-29 వద్ద ఉన్న 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 160 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను డివిజనల్ ఇంజనీర్/ఆపరేషన్ బోధన్ మొహమ్మద్ ముక్తార్ మంగళవారం ఛార్జ్ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... పెరుగుతున్న విద్యుత్(Electricity) డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యం పెంచడం ద్వారా కాలనీ వినియోగదారులకు లో వోల్టేజీ ఇబ్బందులు తగ్గడంతో పాటు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె. నగేష్ కుమార్, బోధన్ టౌన్-2 సెక్షన్ ఏఈ కళ్యాణ్, వార్డు నంబర్ 17 కౌన్సిలర్ మొహమ్మద్ హనీఫ్, వార్డు నంబర్ 30 కౌన్సిలర్ మొహమ్మద్ వలియుద్దీన్, లైన్ ఇన్‌స్పెక్టర్ గఫ్ఫార్, లైన్‌మన్ ఫయాజ్, అసిస్టెంట్ లైన్‌మన్ ప్రవీణ్, విద్యుత్ సిబ్బంది, బసవతారక నగర్ కాలనీ వినియోగదారులు పాల్గొన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో లో వోల్టేజీ సమస్యలు తగ్గి, విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంచినందుకు కాలనీ విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు హర్షం వ్యక్తం చేశారు.