2 September, 2026 | 9:17 AM

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి

02-09-2026 | 08:45am

సర్పంచ్ వాసం సుష్మిత శ్రీకాంత్

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు(Welfare schemes) అందుతాయని గ్రామ సర్పంచ్ వాసం సుష్మిత శ్రీకాంత్ అన్నారు. ఇప్పటికే గ్రామంలో అనేకమందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారికి పెన్షన్లు అందజేస్తాం.

అలాగే ఆహార భద్రత కార్డులు(Food safety cards) కూడా గ్రామంలో 80 శాతం పూర్తి చేసామని ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే తక్షణమే దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఆహార భద్రతా కార్డులు అందజేయడం జరుగుతుందని, గ్రామంలో అంతర్గత రోడ్లు తదితరు సమస్యలను పరిష్కరించామని కనుక గ్రామస్తులు ఏ సమస్యైనా నేరుగా గ్రామపంచాయతీ కార్యాలయానికీ వచ్చి వారి సమస్యను దరఖాస్తు రూపంలో అందజేస్తే వెంటనే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగాతెలిపారు