గత పదేళ్లలో చేయలేని అభివృద్ధి వెయ్యి రోజుల్లోనే ప్రభుత్వం చేసి చూపింది
అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసం శ్రీనాథ్
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి వేయి రోజుల్లోనే చేసి చూపిందని అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీనాథ్(Youth Congress President Vasam Srinath) అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూటికి తొంబైం శాతం పూర్తి చేసిందని, గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో జరిగిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని అలాగే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిందని అర్హులైన వారందరికీ రేషన్ కార్డు(Ration card) మంజూరు చేసిందని తెలిపారు.
అలాగే గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి అంతర్గత రోడ్ల నిర్మాణం అలాగే మండల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి అని శెట్టిపల్లి నుంచి ఆలపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఇప్పటికే ఉన్నత చదువుల పూర్తి చేసి ఉన్న నిరుద్యోగుల కోసం పోలీస్ ఫారెస్ట్ తదితర విభాగాలలో నోటిఫికేషన్ విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మాని జరిగే అభివృద్ధికి సహకరించక పోతే భవిష్యత్తులో వారికి ప్రజలే బుద్ధి చెబుతారని, చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఆమోదించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నులకతాటి శ్రీను ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ఇనుముల ఇందు కుమార్ మర్కోడు గ్రామ శాఖ అధ్యక్షుడు వీరభద్ర చారి,ఆత్మ కమిటీ బూర్న రవి కాంగ్రెస్ నాయకులు ఉల్లోజు భరత్ మంద సాయిరాజ్ శ్రీరామ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.






