సినిమా పైరసీపై ఉక్కుపాదం
- అరికట్టేందుకు ‘సైబర్ బ్యూరో’ ప్లాన్
- పైరసీ చేస్తే మూడేళ్ల జైలు, 3 లక్షల ఫైన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (విజయక్రాంతి): తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నడుం బిగించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమన్వయంతో పైర సీ నెట్వర్క్‌ల వెన్ను విరిచేందుకు అత్యంత శక్తివంతమైన యాంటీ పైరసీ డిస్క్లైమర్, పైరసీ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సోమవారం ఆవిష్కరిం చారు.
టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్‌బాబు ప్రారంభించారు.నూతన నిబంధనల మేరకు ,ఇకపై ప్రతి హాలులో సినిమా ప్రారంభానికి ముందు పైరసీ వల్ల కలిగే శిక్షల గురించి ప్రేక్షకులను హెచ్చరించే డిస్క్లైమర్ బోర్డును తప్ప నిసరిగా ప్రదర్శించాలి.
ఎవరైనా పైరసీకి పాల్పడితే వారికి మూడేళ్లవరకు జైలు శిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి సదరు సినిమా నిర్మాణ వ్యయం లో 5 శాతం మొత్తాన్ని జరిమానాగా వసూ లు చేసేందుకు చట్టంలో అవకాశం కల్పించారు. థియేటర్ యాజమాన్యాలు సి నిమా విడుదలైన తర్వాత కనీసం నెల రో జుల పాటు థియేటర్ లోపల, బయట సీసీటీవీ రికార్డింగులను భద్రపరచాలని ఆదేశించారు.




