17 March, 2026 | 2:28 AM

కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు

17-03-2026 01:14 AM

మంత్రి జూపల్లి సమక్షంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల చేరిక

ఆదిలాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూర్, సోనాల మండలాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల కీలక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాద వ్, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్ నియోజకవర్గ కాం గ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో  హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి మంత్రి, సాద రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఈ చేరికలు దోహ దపడతాయని, కష్టపడే కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.