24-02-2026 12:31:46 AM
ఒకరి మృతి.. జార్ఖండ్‌లో ఘటన
రాంచీ, ఫిబ్రవరి ౨౩: వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఓ రోగిని రాంచీ నుంచి ఢిల్లీకి తరలి స్తుండగా ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఎయిర్ అంబులెన్స్‌లో ఇద్దరు పైలట్లు, ఒక వైద్యుడు, ముగ్గురు పారా మెడికల్ సిబ్బంది, రోగి ప్రయాణిస్తుండగా, ప్రమాదంలో రోగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జార్ఖండ్ ఛత్రా జిల్లాలో చోటుచేసుకుంది. రాం చీకి చెందిన సంజయ్ కుమార్ (౪౧) కొన్నాళ్ల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు.
దీంతో కుటుంబ సభ్యులు ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఎయిర్ అంబులె న్స్ రాంచీ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఛత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సంజయ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీశాయి. ప్రమాదంలో గా యాలపాలైన క్షతగాత్రులను బయటకు తీసి, సమీప ఆసుపత్రులకు తరలించా యి. ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యా క్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ ప్రారంభించింది.