విద్యతోనే జ్ఞాన సమాజం ఏర్పాటు
- బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటేనే కుల గౌరవం, కుటుంబ గౌరవం
- ‘బడికి పోదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాం తి): విద్యతోనే జ్ఞాన సమాజం ఏర్పాటు అని, చదువు అనేది గొప్ప సంపదని, విజ్ఞానాన్ని వికసింప చేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటే ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల కుల గౌరవం, కుటుంబ గౌరవం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బడికి పోదాం‘ కార్యక్ర మానికి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్ ను కూరెళ్ళ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.
అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలతో కలిసి ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బడికి పోదాం రండి.. హాస్టల్లో చేరుదాం రండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ పిల్లలను బడికి పంపాలని కోరారు. మీ పిల్లలను హాస్టలలో, గురుకులాలలో చేర్పించాలని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాలు, దళిత సంఘాల నాయకులు పేద పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయాలన్నారు.
పేద పిల్లలు చదువుకునేందుకు తమ వంతు సహా య సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఎస్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ళ మహేష్ కుమార్, బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, టిఎస్‌ఎస్‌ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్తన్న, ప్రధాన కార్యదర్శి గంధమల్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్, బీసీ ఐక్య కులాల వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, నిఖిల్ పటేల్, బాలయ్య పాల్గొన్నారు.






