క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్
రేప్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ మెడికల్ స్టూడెంట్ ఫిర్యాదుతో కేసు నమోదు
కోల్ కత్తా, ఆగస్టు 11: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, బెంగాల్ కు చెందిన అభిషేక్ పోరెల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన రేప్, బెదిరింపుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ హుగ్లీలోని మోగ్రా పోలీస్ స్టేషన్లో అభిషేక్ పోర్పె ఫిర్యాదు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరం కలిసి విదేశీ టూర్స్కు కూడా వెళ్లామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది తామిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అభిషేక్ పోరెల్ తనపై దాడి చేసి బెది రింపులకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు.ఈ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అభిషేక్ పోరెల్ను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించినా.. అతను అందుబాటులోకి రాలేదు. దాంతో ఆ యువతి కోల్కతా హైకోర్టును ఆశ్ర యించగా.. అభిషేక్ పోరెల్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
ఈ క్రమంలో మంగళవారం అభిషేక్ పోరెల్ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే యువతి ఆరోపణలను గతంలో అభిషేక్ పోరెల్ ఖండించాడు.వికెట్ కీపర్ కమ్ లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్.. 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 35 ఐపీఎల్ మ్యాచ్ల్లో 25.63 సగటుతో 769 పరుగులు చేశాడు. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే అభిషేక్ పోరెల్.. 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 31.28 సగటుతో 1408 రన్స్ చేశాడు. ఈ కేసుతో అభిషేక్ పోరెల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసు కారణంగా ఈ సీజన్ దేశవాళీ క్రికెట్ మొత్తానికి అతను దూరం కానున్నాడు. ఈ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకపోతే.. ఐపీఎల్ 2027 సీజన్కు కూడా దూరమవుతాడు.






