12 August, 2026 | 1:34 AM

ఐటీఎఫ్ డబ్ల్యూటీటీ మెయిన్ డ్రాకు శ్రీమాన్యరెడ్డి

12-08-2026 12:00 AM

అస్తానా, ఆగస్టు 11: భారత్‌కు చెందిన 18 ఏళ్ల అనుగొండ శ్రీమాన్య రెడ్డి కజకిస్థాన్లోని అస్తానాలో జరుగుతున్న ఐటీఎఫ్ డబ్ల్యూటీటీ టోర్నమెంట్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మొదటి రౌండ్లో బై పొందిన శ్రీమాన్య రెడ్డి, రెండో రౌండ్లో చైనాకు చెందిన జియాయోయూ జువాన్ ను 2-6, 6-2, 10-8తో ఓడించింది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను కోల్పోయినప్పటికీ, అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది.ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్లో మెక్సికోకు చెందిన జిమెనా సెంటీస్ పై 6-3, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించి మెయిన్ డ్రాలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.ఈ విజయంతో యువ భారత క్రీడాకారిణి అంతర్జాతీయ టెన్నిస్లో మరో కీలక అడుగు ముందుకు వేసింది.