16 July, 2026 | 1:04 AM

దారులు ఎప్పుడో మూసుకుపోయాయి

24-04-2024 12:41 AM

కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం తనకు లేదని.. వెస్టిండీస్ జట్టు తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయంటూ ఆ జట్టు మాజీ క్రికెటర్ సునీల్ నరైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని.. విండీస్ జట్టులోకి రీఎంట్రీ అసాధ్యమని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా తరపున నరైన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్‌గా వస్తూ సంచలన ఇన్నింగ్స్‌లతో జట్టుకు మెరుపు ఆరంభాలనిస్తున్నా డు. ‘ఇటీవల కాలంలో నేను చేసిన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయి. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని 2024 టీ20 ప్రపంచకప్ ఆడాలని అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తా. అయితే రిటైర్మెంట్‌తో ప్రశాంతంగా ఉన్నా.’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విండీస్ తరపున 2019లో చివరిసారి ఆడిన నరైన్ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.