16 July, 2026 | 12:50 AM

ఫిక్సింగ్ కలకలం..

24-04-2024 12:45 AM

కొలంబో: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో ఫిక్సింగ్ అంశం కలకలం రేపింది. ఎల్‌ఎల్‌సీ టీమ్ మేనేజర్ యోనీ పటేల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ అటార్నీ జనరల్ ఆఫీస్ విభాగం కొలంబో హైకోరు ల్టో చార్జీషీట్ దాఖలు చేసింది. యోని పటేల్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ పంజాబ్ రాయల్స్ క్రికెటర్ నీల్ బ్రూమ్, క్యాండీ సాంప్ ఆర్మీ ఆటగాడు తరంగలు ఆరోపించారు.

లెజెండ్స్ లీగ్‌లో పాల్గొన్న కొంతమంది క్రికెటర్లకు మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలంటూ యోనీ పటేల్ పెద్ద ఎత్తున ముడుపులు అందించారని పేర్కొన్నారు. ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా ఆడకపోవడం, వికెట్లు సమర్పించుకోవడం చేశారని వివరించారు. విచారణ చేపట్టిన కొలంబో హైకోర్టు యోని పటేల్‌తో పాటు మరో మేనేజర్ ఆకాశ్‌ను దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ ఏడాది మార్చి 8 నుంచి 19 వరకు శ్రీలంకలోని పల్లకెలె వేదికగా లెజెండ్స్ క్రికెట్  లీగ్ టోర్నీ జరిగింది.