29 August, 2026 | 2:43 AM

అనయ బంగర్‌ను ఎలా ఆడిస్తారు?

29-08-2026 01:36 AM

సఫారీ మహిళా క్రికెటర్ కాప్ విమర్శలు

ధీటుగా బదులిచ్చిన అనయ

మెల్ బోర్న్, ఆగస్టు 28: ట్రాన్స్ జెండర్ క్రికెటర్ అనయ బంగర్‌ను దేశవాళీ క్రికెట్ లో అనుమతిస్తూ ఆస్ట్రేలియా బోర్డు తీసుకు న్న నిర్ణయంపై దుమారం రేగుతోంది. లింగ మార్పిడి అనంతరం క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన ఆమెకు.. ఆస్ట్రేలియాలోని కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది.

ఈ విషయంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే సింది. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవకాశం కూడా రావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనయకు అనుమతి లభించినట్లు పేర్కొంటూ వచ్చిన వార్తను మారిజాన్ కాప్ తన ఇన్‌స్టాగ్రాం స్టోరీలో షేర్ చేసింది.

ఇది పూర్తిగా హాస్యాస్పదమనీ, అనయ బంగర్ క్రికెట్ ఆడేందుకు అసలు అనుమతి ఇవ్వకూడదం టూ ఘాటుగా స్పందించింది. ఇది మహిళా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఇది సరైన నిర్ణ యం కాదని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. ఈ విమర్శలపై అనయ కూడా ధీటుగా బదులిచ్చింది.

తాను నిబంధనల ప్రకారమే అర్హత సాధించానని, విమర్శకులు తగిన అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేసింది. ఆసీస్ బోర్డు తనకు కేవలం ఒక మార్గాన్ని మాత్రమే ఇచ్చిందని, జట్టులో చోటు మాత్రం తన ప్రతిభ ద్వారానే సంపాదించుకుంటానని తెలిపింది. అనయ బంగర్ గతంలో పురుషుల క్రికెట్‌లో ముంబై అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది మార్చిలో ఆమె లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ట్రాన్స్ జెండర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వీలు లేదు. కానీ ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల ప్రకారం అక్కడ దేశవాళీ క్రికెట్, బిగ్ బాష్ వంటి లీగ్స్ ఆడేందుకు అనుమతి ఉంది.