08-01-2026 10:03:58 PM
హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ జూబ్లీహిల్స్ లో సందడి చేసింది. భారతదేశంలో మొట్టమొదటి సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్‌ను పరిచయం చేస్తూ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆమె ప్రారంభించింది. అంతర్జాతీయ-నాణ్యతతో కూడిన చర్మ సంరక్షణ చికిత్సల కోసం దీనిని ప్రారంభించారు. దేశంలో చెన్నై సిఓఈ తర్వాత హైదరాబాద్‌లోనే రెండో సెంటర్ ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు.
అంతర్జాతీయ విశిష్ట ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన సౌందర్య సంరక్షణను అందిస్తున్న వీకేర్ క్లినిక్ కు నివేదా పేతురాజ్ శుభాకాంక్షలు తెలియజేసింది. సినిమా రంగంలో ఉన్న తమకు స్కిన్ కేర్ ఎంత అవసరమో అందరికీ తెలుసని , వీకేర్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అత్యుత్తమ క్లినిక్ హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని నివేదా చెప్పింది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్‌ను ఇక్కడ చేస్తారని వికేర్ గ్రూప్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఇ . కరోలిన్ ప్రభ చెప్పారు. వి కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపంచంలోని అత్యంత అధునాతన ఎఫ్ డిఏ ఆమోదించబడిన సిఈ -సర్టిఫైడ్ సెంటర్ గా ఉందన్నారు.