30 June, 2026 | 11:04 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి నిధులు జమ

17-06-2025 10:59 PM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..

సూర్యాపేట (విజయక్రాంతి): రైతుకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా నిధులు జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అయినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandalal Pawar) మంగళవారం విలేకరులకు తెలిపారు. వానాకాలం-2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద జిల్లాలో 2,85,344 మంది రైతులకు గాను మూడు ఎకరాల లోపు వరకు ఉన్న 2,17,698 మంది రైతులకు రూ.167.69 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయన్నారు. రైతుకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. అయితే ఇచ్చిన హామీ మేరకు వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందించడం పట్ల రైతుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.