11 August, 2026 | 1:37 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఫారెస్ట్ ట్రెంచ్ పనులను అడ్డగించిన గిరిజనులు..

17-06-2025 10:56 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి సెక్షన్ సౌత్ బీట్ లో 1149 కంపార్ట్మెంట్ ఫారెస్ట్ భూమిలో అటవీశాఖ అధికారులు భూమి ఆక్రమించకుండా జేసిబితో ట్రెంచ్ పనులు నిర్వహిస్తుండగా ఆ భూమి మాదేనంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ట్రెంచ్  పనులు నిర్వహిస్తున్న జేసిబికి అడ్డుగా కొందరు గిరిజన మహిళ రైతులు అడ్డుపడడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏండ్ల తరబడిగా తాము ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమకు ప్రభుత్వం నుండి హక్కు పత్రాలు కూడా వచ్చాయని, ఇప్పుడు అటవీశాఖ అధికారులు, డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా వచ్చి ఖండాలు తీయడం సరికాదంటూ గిరిజనులు అడ్డుకున్నారు.

ఆ భూములను స్వాధీనం చేసుకొని మా పొట్ట కొట్టకండి అని వేడుకున్నారు. అవసరమైతే మా ప్రాణాలను వదులుకుంటామని, కందకం తీయకుండా అడ్డుకుంటామని భీష్మించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. కేసముద్రం ఎస్ఐ మురళీధర్ మాట్లాడుతూ... వివాదాస్పద భూమికి సంబంధించిన ఆధారాలు, అవసరమైన పత్రాలు తీసుకువచ్చి సమర్పించాలని, ఆ తర్వాత రెవెన్యూ శాఖ సర్వే ఆధారంగా భూమి ఎవరిది అనేది నిర్ణయించడం జరుగుతుందని అప్పటివరకు, గొడవకు దిగవద్దని సూచించడంతో తాత్కాలికంగా గొడవ నిలిచిపోయింది.