13 June, 2026 | 2:13 AM

జిల్లాలో పంట కొనుగోలు సంపూర్ణం

13-06-2026 01:09 AM

రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేశాం 

విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెల్లడి 

నిర్మల్ జూన్ 1౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించినప్పటికీ పంట కొనుగోలు సంపూర్ణంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడించారు. గురువారం జిల్లా అధికారులతో కలిసి వివరాలను వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరి జొన్న మూడు పంటలు ఒకేసారి వచ్చినప్పటికీ అధికారుల సమన్వయం రైతుల సహకారం తో జిల్లాలో విజయవంతంగా కొనుగోలు పూర్తి చేసి ప్రతి దాన్ని గింజలు తడవకుండా గోదాములకు తరలించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1. 68 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశామన్నారు. 1.72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 40 వేల మెట్రిక్ టన్నుల జొన్న పంటలు సంపూర్ణంగా కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించామన్నారు.

జిల్లా వ్యాప్తంగా వర్షాలకు ముందే పంట కొనుగోలు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగానికి అందుకు సహకరించిన రైతులకు ప్రభుత్వ విధానాలను రైతులకు అవగాహన కల్పించిన మీడియా వాళ్ళఇది సాధ్యం అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా పంట ఉత్పత్తుల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని ఇది రైతు ఎదగడానికి కారణం అన్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వ సహకారంతో కొత్త గోదాములను నిర్మిస్తామని తెలిపారు. రైతులు ఒకే పంట పండించే విధానాన్ని మానుకొని పంట మార్పిడి పద్ధతులు పాటించాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటలు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అందుకు ప్రభుత్వ ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి జిల్లా వ్యవసాయ శాఖ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ. మార్క్ఫెడ్ డి ఎం మహేష్ జిల్లా అధికారులు ఉన్నారు.