6 April, 2026 | 10:25 PM

కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి

06-04-2026 09:02 PM

- కిసాన్ సంఘ్ నేతలు

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మొక్క జొన్న, జొన్న, వరి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతుల నుండి తక్షణమే పంటలను కొనుగోలు చేయాలని కిసాన్ సంఘ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ నేతలు నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రం అందచేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక  వసతులు కల్పించాలని, అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టర్పాలిన్ కవర్ లు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. యూరియా యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ తొలగించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని, అంతే కాకుండా ఎలాంటి పరిమితులు లేకుండా రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకి అందేలా చూడాలని వారు అధికారులకు విన్నవించారు.