7 May, 2026 | 10:56 PM

దేవాదుల ఫేజ్-2కు రూ.148కోట్లు

28-11-2024 12:13 AM

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): దేవాదుల ఫేజ్-2లో 18 కిలోమీటర్ల మేరకు కెనాల్ పనుల కోసం ప్రభుత్వం రూ.148.76కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ లైనింగ్ నుంచి ఆర్‌ఎస్ ఘణపూర్ మెయిన్ కెనాల్ వరకు పనులు కోసం ఈ నిధులను మంజూరు చేసింది. పనుల నాణ్యతలో రాజీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత చీఫ్ ఇంజనీర్‌దే అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.