బీసీ సంక్షేమశాఖకు రూ.174 కోట్లు నిధులు విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయ క్రాంతి): 2024-25 వార్షిక బడ్జెట్‌లో అంచనా వ్యయంలో భాగాంగా బీసీ సంక్షేమశాఖకు రూ.174.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం పరిపాలనా పరమైన అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీచేశారు. బీసీ సంక్షేమ శాఖలోని పలు విభాగాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ నిధులను కేటాయించారు.
ఇందులో బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.4.01 కోట్లు, తెలంగాణ వాషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు రూ.16.51 లక్షలు, తెలంగాణ నాయీబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు రూ.18.66 లక్షలు, తెలంగాణ తాటి టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.1.22 కోట్లు, మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.1.13 కోట్లు, తెలంగాణ స్టడీ సర్కిల్‌కు రూ.29.83 లక్షలు, బీసీ గురుకుల సొసైటీకి రూ.167.94 కోట్లు విడుదల చేశారు.






