2 August, 2026 | 5:03 PM

దాడులకు ప్రతి దాడులు తప్పవు

24-08-2024 01:17 AM
  1. మా కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే గుణపాఠం చెప్తాం
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే తారక రామారావు 
  3. గాదరి కిశోర్, మహిళా జర్నలిస్టులపై దాడిపై డీజీపీకి ఫిర్యాదు 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి): కాంగ్రెస్ దాడులకు ప్రతి దాడులు తప్పవని, తమ కార్యకర్తల ఓపికను పరీక్షిస్తే తగిన సమయంలో గుణపాఠం చెప్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ హెచ్చరిం చారు. కాంగ్రెస్ శ్రేణుల దాడులు, పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మా గంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా నిరసన తెలిపాలని నిర్ణయించుకున్నామని, అందుకే కాంగ్రెస్ దాడులు చేసినా.. ఎలాంటి ప్రతిఘటనలకు పాల్పడలేదని చెప్పారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రైతు దీక్ష చేపట్టామని, 50 మంది కాంగ్రెస్ గుండాలు తాగిన మత్తులో రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలు తిరగబ డి ఉంటే ఆ కాంగ్రెస్ మూకలు ఒక్కరు కూడా మిగిలేవారు కాదని హెచ్చరించారు.

పోలీసులే తమ దీక్షకు సంబంధించిన టెంట్ కూల్చివేయడం ఆశ్చర్యం కలిగించిందని, ప్రజలకు సమాధానం చెప్పలేక దద్దమ్మ ముఖ్యమంత్రి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లితే కాంగ్రెస్ గుండాలు అసభ్యకరంగా దాడి చేశారని అన్నారు. రుణమాఫీ అర్హులైన రైతులకు అయిందో? లేదో? తెలుసుకోవడానికి వెళ్లితే వారిపై కూడా కాంగ్రెస్ చిల్లరగాళ్లు దాడి చేశారని ధ్వజమెత్తారు. మహిళా జర్నలిస్టులకు రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులను, వ్యవసాయ అధికారులను తప్పు బట్టాల్సిన పనిలేదని..సీఎం రేవంత్ చేతకాని సన్యాసి అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించ వద్దు 

పోలీసుల మీద తమకు సానుభూతి ఉందని, కొంతమంది పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అది వారికే మంచిది కాదని హితవు పలికారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సామాజిక మాద్య మాల్లో పోస్టులు పెడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై, జర్నలిస్టులపై దాడి చేసిన గుండాలపై కేసులు పెట్టి అరెస్టు చే యాలని డిమాండ్ చేశారు.

ఇదే విధంగా దా డులు కొనసాగితే తమ నుంచి ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీయవద్దనే ఇప్పటివరకు ఊరుకుంటున్నామని, మా సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని, తాము ప్రతిఘటించాక పార్టీలను నిందించొద్దని చెప్పా రు. కొంతమంది పోలీసులు మంత్రుల జన్మదిన వేడుకల్లో పరివశించి పోతున్నారని, డీజీపీని ఇలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు.