రూ. 2.14 కోట్ల నగదు జప్తు
13-05-2024 01:43 AM
మంథని, మే12(విజయక్రాంతి): తనిఖీల్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు రూ.2.14 కోట్లకుపైగా జప్తు చేశామని, అందులో సరైన ఆధారాలు పరిశీలించి గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.2.8 కోట్లకు పైగా విడుదల చేసినట్టు పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథనిలో రూ.13.80 లక్షలు, బెల్లంపల్లిలో రూ.61 లక్షల పైన, చెన్నూర్‌లో రూ.12.96 లక్షలు, మంచిర్యాలలో రూ.19.5 లక్షలు సీజ్ చేశామని తెలిపారు. ఆధారాలను పరిశీలించిన గ్రీవెన్స్ కమిటీ పూర్తి స్థాయిలో నగదును విడుదల చేసిందని తెలిపారు. సరైన ఆధారాలు సమర్పించని కారణంగా 5.91 లక్షలు విడుదల చేయలేదని వెల్లడించారు.




