11 April, 2026 | 1:33 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌

11-04-2026 11:59 AM

 సత్తుపల్లి ఏప్రిల్ 11. ( విజయ క్రాంతి):సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కుట్రపూరితంగా 'ఉపా' (UAPA) కేసు నమోదు చేయడాన్ని పార్టీ సత్తుపల్లి మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామం లో జరిగిన సమావేశం లో పార్టీ డివిజన్ కార్యదర్శి అవుకు వెంకన్న, డివిజన్ నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్ , పార్టీ మండల కార్యదర్శి తాటి రాజు తెలిపారు. ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశత్వంతో ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

గత 50 ఏళ్లుగా కామ్రేడ్ పోటు రంగారావు భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంగా రాజ్యాంగబద్ధంగా, బహిరంగంగా ప్రజా ఉద్యమాలను నడుపుతున్నారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిపై అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికం. రాజ్యాంగ పరిధిలో ఉంటూ ప్రభుత్వాల ఉల్లంఘనలను ప్రశ్నించడం నేరం ఎలా అవుతుంది?" అని నేతలు నిలదీశారు. 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు 'ఉపా' చట్టం కింద కేసు నమోదు చేసిన NIA, ఈ నెల 22వ తేదీన దర్యాప్తునకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అనుసరిస్తున్న మతోమాదం ఫాసిజం విధానాలను వ్యతిరేకిస్తూ పార్టీ పోరాటాల నిర్మిస్తుందని ప్రశ్నించే గొంతులను అర్బన్ నక్సలైట్ పేరుతో ఉక్కు పాదం మోపటం సరైన పద్ధతి కాదని  తక్షణమే ఈ అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.