మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్
11-04-2026 12:03 PM
ఖమ్మం, ఏప్రిల్ 11(విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొని,జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..




