14 July, 2026 | 10:07 PM

2200 కోట్ల పెట్టుబడులు

09-06-2024 02:13 AM

టీజీఐఐసీ ద్వారా సాధించిన రాష్ట్రం

పెట్టుబడులు పెడుతున్న 113 కంపెనీలు

7 వేల మందికి ఉపాధి అవకాశాలు

పరిశ్రమలకు భూమి కేటాయించిన టీజీఐఐసీ 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో పలు కంపెనీలు రూ. ౨,౨౦౦ కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిం చనున్నాయి. కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చిన పెట్టుబడిదారులకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) భూములు కేటాయించింది. ఈ పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం లో ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకో నున్నాయి. 

113 కంపెనీలు

రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీల దరఖాస్తులను టీజీఐఐసీ ఎప్పటికప్పుడు పరిశీలించి భూకేటాయింపులు చేస్తున్నది. గత మూడు నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీజీఐఐసీకి దాదాపు 140 కిపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన టీజీఐఐసీ.. 113 కంపెనీలు భూకేటాయింపులకు అర్హమైనవి గా గుర్తించి ఎన్నికల కోడ్ ఎత్తవేసిన వెంటనే భూకేటాయింపులు చేసింది.

వీటి ద్వారా రాష్ట్రానికి రూ.2,200 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు.. దాదాపు 7000 మందికి పైగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని భావిస్తున్నారు. భూమిని కేటాయించిన కంపె నీల్లో ఫ్రాన్స్‌కు చెందిన మానే, హాం కాంగ్‌కు చెందిన ఏపీసీతోపాటు మలబార్ గోల్డ్ వంటి కంపెనీలున్నాయి. భూ కేటాయింపుల్లో దాదాపు 70 శాతం ఎంఎస్‌ఎంఈ కంపెనీలకు టీజీఐఐసీ ప్రాధాన్యమిచ్చింది. 

రూ.50 వేల కోట్ల కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు టీజీఐఐసీ ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక సదుపా యాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యే క దృష్టి కేంద్రీకరించిందని అధికారులు వెల్లడించారు. స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత ఇవ్వడానికి, దేశవిదేశీ పెట్టుబడులను ఆకర్షిం చడానికి మరిన్ని ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నది.

2023 డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ.50 వేల కోట్ల కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు టీజీఐఐసీ అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్లు, అనంతరం మరో రూ.10 వేల కోట్ల పెట్టు బడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువై న ప్రదేశాలను గుర్తించి భూమిని కేటాయించడానికి టీజీఐఐసీ ఈ కంపెనీ లతో స్నేహపూర్వకంగా కలిసి పనిచేస్తోందని అధికారులు పేర్కొన్నారు.