ఎస్జీటీ సాధారణ బదిలీలు విడతలవారీగా చేపట్టండి
27-06-2024 12:18 AM
ప్రభుత్వానికి తపస్ నేత వినతి
హైదరాబాద్, జూన్ 2౬ (విజయక్రాంతి): ఎస్జీటీ సాధారణ బదిలీలను విడతల వారీగా చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేష్ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. సాధారణ బదిలీలు కోరుకునే ఎస్జీటీ ఉపాధ్యాయుల సంఖ్య 1000 నుంచి 1800 వరకు ఉందని, ప్రతీ టీచర్ ప్రాధాన్యత క్రమంలో వందల సంఖ్యలో తాము కోరుకునే పాఠశాల స్థానాలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నమోదు చేసుకోవడం కష్టమని విన్నవించారు. ప్రతిరోజూ 400 మంది చొప్పున ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలకు అవకాశం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.






