3 July, 2026 | 5:13 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు

20-03-2025 12:38 AM

రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో 13.19 శాతం

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మొత్తం రూ.3,04,965 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 40,232 కోట్లు ఎస్సీ సంక్షేమాభివృద్ధికే కేటాయించడం విశేషం. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో 13.19 శాతంగా నమోదైంది. ఇక గత 2024-24 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమాభివృద్ధికి రూ.33,124 (11.37శాతం) కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈసారి 1.82 శాతం కేటాయింపులు పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ బడ్జెట్‌లో రూ.7,108 కోట్లు అదనంగా నిధులు కేటాయించారు.