21 March, 2026 | 3:17 AM

వైద్య శాఖకు 13,697 కోట్లు

21-03-2026 01:39 AM
  1. గత బడ్జెట్‌లో 12,393 కోట్లు 

ఈ బడ్జెట్‌లో 1.286 కోట్లు అదనం

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెడ్‌లో ప్రభుత్వం నిధులు పెంచింది. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాల మేరకు మతాశిశు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాదుల నియంత్రణ, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు రూ.13,679 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించగా.. ఈసారి 1,286 కోట్లు అదనంగా కేటాయించింది. ఇందులో నిర్వహణ కోసం రూ.6,984 కోట్లు, పథకాల కోసం రూ.6,695 కోట్లు కేటాయించింది.

ఈ నిధులు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా బెడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి డిజిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య రంగం విస్తరణలో భాగంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కొనసాగుతుండగా , 3 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం పడకల సంఖ్య 44,029 కు పెరిగింది. జిల్లా స్థాయిలో క్యాన్సర్, ఎన్సీడీ, పాలియేటివ్ సెంటర్లను ప్రభుత్వం విస్తరించింది.