లోటు నుంచి.. మిగులు దిశగా
- 2026 6,857.76 కోట్ల మిగులు బడ్జెట్
- అంచ 2024 9,420 కోట్ల లోటు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): తెలంగాణలో వార్షిక బడ్జెట్ లోటు నుంచి మిగులు దిశగా సాగుతున్న సంకేతా లు వస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో రూ.6,857.76 కోట్ల మిగులు బడ్జెట్‌ను ఆ ర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024 మొత్తం రెవెన్యూ స్వీకరణ రూ.1,67,804.32 కోట్లు ఉండగా.. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.1,77,224,37 కోట్లుగా లెక్కలు తేల్చారు.
అంటే ఆ సంవత్సరం మొత్తం రెవెన్యూ లోటు రూ.9420.05 కోట్లుగా స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో (రివైజ్డ్ ఎస్టిమేషన్) రెవెన్యూ స్వీకరణ రూ.2,03,970.99 కోట్లు. ఇందులో మొత్తం రెవెన్యూ వ్యయం రూ.2,03,379.63 కోట్లుగా బడ్జెట్ గణాంకాలో చెప్పారు. అంటే ఆ యేడు రెవెన్యూ మిగులు రూ. 591.37 కోట్లుగా చూపెట్టారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్ అంచనాల్లో మొత్తం రెవెన్యూ స్వీకరణ రూ.2,41,263.58 కోట్లుగా చూపెట్టారు.
ఇక మొత్తం రెవెన్యూ వ్యయం రూ. 2,34,405.82 కోట్లుగా అంచనా వేశారు. దీనితో రెవెన్యూ మిగులు అంచనా రూ.6857.76 కోట్లుగా బడ్జెట్‌లో చెప్పుకొచ్చారు. అంటే 2024 పూర్తిగా రెవెన్యూ లోటు నుంచి.. 2025 కాస్త రెవెన్యూ మిగులు బడ్జెట్‌గా చూపించగా.. 2026 వచ్చేసరికి రూ. 6857 కోట్లకుపైగా రెవెన్యూ మిగులు అంచనాను చూపించడం గమనార్హం. ఇదే బడ్జెట్‌లో క్యాపిటల్ రిసీప్ట్‌ల కేటగిరీలో సుమారు రూ.82,870.42 కోట్లను వివిధ మార్గాల్లో రుణాలను తీసుకుంటామని పేర్కొన్నారు.




